English | Telugu
హీరో సిద్ధార్థ్‌కి కావేరి సెగ
Updated : Sep 29, 2023
తమిళ నటుడు సిద్ధార్థ్ ఇటు తెలుగు, అటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేయటానికి ఆసక్తి చూపే ఈ హీరో సామాజిక మాధ్యమాల్లో రాజకీయాలపై కూడా కామెంట్స్ చేస్తుంటారు. తన అభిప్రాయాలను చెప్పే క్రమంలో ఇతరులను విమర్శించటానికి కూడా ఆయన వెనుకాడరు. దీని కారణంగా ఆయనకు సమస్యలు వస్తున్నాయి. అయినా కూడా సరే! తన పంథాను ఆయన మార్చుకోవటం లేదు. ఇప్పుడు మరోసారి సిద్ధార్థ్‌కు రాజకీయ పరమైన సమస్య వచ్చింది. అది కూడా తన సినిమా ప్రమోషన్స్ సమయంలో రావటం.. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది మరి. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రతీ ఏడాది కావేరీ జలాలకు సంబంధిం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. దీనిపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులే కాదు.. తమిళ నటీనటులు కూడా తమదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటారు. తమిళులకు అండగా వారి సినీ పరిశ్రమకు చెందిన నటులు మాట్లాడటం అనేది సాధారణంగా జరిగే విషయమే. ఇలాగే సిద్ధార్థ్ సైతం కావేరి జలాలపై గతంలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ఇప్పుడదే సమస్యను తెచ్చి పెట్టింది. సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం చిత్తా (తెలుగులో చిన్నా, మిగిలిన భాషల్లో చిక్కు) పేరుతో విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన బెంగుళూరు చేరుకున్నారు.
అయితే ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో కొందరు నిరసనకారులు అక్కడకు చేరుకుని ప్రెస్ మీట్ జరగకూడదంటూ నిరసనను తెలియజేశారు. సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా అన్నారు. ఇక చేసేదేం లేక అక్కడి నుంచి సైలెంట్‌గా వచ్చేశారు. అసలు సినిమాలకు, కావేరి జలాలకు సంబంధం ఏంటని.. ఇది సరికాదంటూ కొందరు నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.