English | Telugu
సల్మాన్ ఖాన్ చెల్లెలి పెళ్ళిలో రామ్ చరణ్ సందడి
Updated : Nov 19, 2014
సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత వివాహం హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సుందరంగా ముస్తాభైన ప్యాలెస్ కంటే ముచ్చటగా అర్పిత ఖాన్, ఆయుష్ శర్మ జంట నిలిచింది. ఈ పెళ్ళికి ఎంతో మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ పెళ్లికానుకగా ముంబైలో రూ.16 కోట్లు విలువజేసే టెర్రస్ ప్లాట్ ను తన చెల్లికి బహుమతిగా ఇచ్చారు. అలాగే టాలీవుడ్ కు ప్రముఖ హీరోలు కూడా ఈ పెళ్ళిలో సందడి చేశారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ పెళ్ళిలో బాగా సందడి చేసినట్లు సమాచారం. బాలీవుడ్ తారలతో సేల్ఫీలు దిగుతూ పెళ్లిని బాగా ఎంజాయ్ చేశారట. రామ్ చరణ్ ఓ ప్రైవేటు ఫంక్షన్ లో ఇంత సందడిగా ఎప్పుడూ కనిపించలేదని టాలీవుడ్ వర్గాల సమాచారం.