English | Telugu
హరీష్ దర్శకత్వంలో సాయిధరమ్
Updated : Mar 3, 2014
ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు సాయిధరమ్ తేజ్. సాయి నటించిన "రేయ్" సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. కానీ తను నటిస్తున్న "పిల్లా నువ్వులేని జీవితం" సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. అదే విధంగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాతగా వాసు వర్మ దర్శకత్వంలో సాయి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా సాయి మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయి ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను నిర్మాత పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నారు.