English | Telugu
రణబీర్ కోసం అమితాబ్ ఎదురుచూపులు
Updated : Mar 3, 2014
తన కంటే రణబీర్ కపూర్ పాపులర్ అని స్వయంగా అమితాబ్ బచ్చన్ ఇటీవలే అన్నాడు. అమితాబ్ నటించిన "భూత్ నాథ్ రిటర్న్స్" చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఇందులో రణబీర్ ఓ ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ... ఇందులో నాకు రణబీర్ కాంబినేషన్ లో సన్నివేశాలు లేవు. కానీ తనతో కలిసి ఓ సినిమా చేయాలనుంది. తను హీరోగా నటించబోయే సినిమాలో ఏదైనా చిన్న పాత్ర అయినా సరే తనతో చేయాలని ఉంది. తనలాంటి యువకులతో కలిసి పనిచేయడం ద్వారా ఓ కొత్త ఎనర్జీ వస్తుంది. వాళ్ళ నుండి నేర్చుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉంటాయి" అని అన్నారు. మరి అమితాబ్ కోరికను రణబీర్ తీరుస్తాడో లేదో తెలియదు.