English | Telugu
హీరోపై నీతూ సంచలన కామెంట్లు
Updated : Mar 3, 2014
"గోదావరి" సినిమాలో సుమంత్ మరదలి పాత్రలో నటించిన నీతూచంద్ర హీరో రాజశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజశేఖర్ మందుకొట్టి, గన్ పట్టుకుని సెట్స్ కు వస్తారని, దానివల్ల తనకెంతో భయం వేస్తుంది. అందుకే అతనితో కలిసి ఏ సినిమాలోనూ నటించేందుకు ఒప్పుకోవడం లేదని నీతూ ట్విట్టర్ ద్వారా తెలిపింది. రాజశేఖర్ సెట్స్‌కి ఆలస్యంగా వస్తాడని, నటీనటులను భయపెట్టేందుకు గన్ కూడా తెస్తాడని పేర్కొన్నది. రాజశేఖర్‌తో కలిసి సినిమాలు చేయకపోయినప్పటికీ, అతగాడు పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఈ విషయం ప్రజలకు తెలియాలని అందుకే దీన్ని హైలైట్ చేస్తున్నట్టు నీతూచంద్ర తెలిపింది. అంతే కాకుండా ఈ విషయాన్ని హీరో నాగార్జునకు చెప్తే...అలాంటి భయలేవి పెట్టుకోవద్దని ధైర్యం చెప్పాడని తెలిపింది. ప్రస్తుతం నాగ్ ఫ్యామిలీ నటిస్తున్న "మనం" సినిమాలో నీతూ నటిస్తుంది.
ఇదిలా ఉంటే... ఈ వార్త చదివిన వారందరికి కూడా ఇదొక పబ్లిక్ స్టంట్ లా అనిపిస్తుంది. ఎందుకంటే... రాజశేఖర్ తో ఒక్క సినిమా కూడా చేయని ఈ అమ్మడికి అతను సెట్స్ కి ఎలా వస్తాడో ఎలా తెలుసు? ఇది కేవలం ఈ అమ్మడు పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడుతుందని టాక్. మరి దీనిపై రాజశేఖర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. రాజశేఖర్ కంటే ముందుగా జీవిత ఎలా స్పందిస్తుందో మరి కొద్ది రోజుల్లోనే తెలియనుంది.