English | Telugu

‘సుబ్రమణ్యం..' రొమాన్స్ అదిరింది

సాయిధరమ్ తేజ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాకు మొదటి రోజు మంచి టాక్ వచ్చింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ కి నచ్చే విధంగా తీయడంలో సక్సెస్ అయ్యాడట. అలాగే ఈ సినిమాలో అందరూ ముఖ్యంగా చెప్పుకుంటుంది సాయిధరమ్ తేజ రెజీనాల కెమిస్ట్రీ గురించే. ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా పండిందట. రొమాంటిక్ సన్నివేశాల్లో అయితే రేచ్చిపోయారట. ఇద్దరి మధ్య ఓ లిప్ లాక్ కాని లిప్ లాక్ కూడా పెట్టాడు హరీష్ శంకర్. ఓ సన్నివేశంలో ఇద్దరి పెదవులు కలుస్తాయి. ఐతే బాలీవుడ్ లిప్ లాక్ ల తరహాలో శ్రుతి మించకుండా కేవలం.. అలా పెదవులు అలా తాకించి వదిలేశాడు. దీంతో ఈ ముద్దు వల్గర్ గా అనిపించకుండా.. రొమాంటిక్ గా ఉందన్న ఫీలింగ్ కలిగించింది. ఉయ్యాల్లోంచి రెజీనా బుగ్గ మీద ముద్దులు పెట్టే సీన్ కూడా ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇక పాటల్లో ఇద్దరూ ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ వేసిన స్టెప్పులు కూడా అదిరిపోయనని అంటున్నారు. మొత్తానికి హరీష్, సాయి కోరుకున్న హిట్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ తో దక్కినట్టే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.