English | Telugu

మెగా సుప్రీం హీరో జోరు తగ్గిందెందుకని?

కెరీర్ ప్రారంభంలో మెగా మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వ‌రుస చిత్రాలు చేస్తూ తనదైన దూకుడు చూపించారు. మెగాస్టార్ కి త‌గిన మేన‌ల్లుడు అనిపించుకుని అభిమానుల చేత సుప్రీం హీరో అనే బిరుదు కూడా అందుకున్నారు. ఈయ‌న వ‌ర‌స విజయాల‌తో సేఫ్ బ‌డ్జెట్ తో మీడియం రేంజ్ నిర్మాత‌లకు అందుబాటులో ఉంటూ వ‌చ్చారు. మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. టైర్ 2 హీరోల‌లో మొద‌టి స్థానంలో సాగారు. అతి తక్కువ టైంలోనే మెగా ఫ్యాన్స్ కు దగ్గర అయ్యారు. ఆయన నటించిన చివరి హిట్ చిత్రం ప్రతిరోజు పండగే. ఆ తర్వాత వచ్చిన సోలో బ్రతుకే సో బెటరు, 2021 లో రిపబ్లిక్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రిపబ్లిక్ టైం లోనే అతనికి భారీ యాక్సిడెంట్ జరిగింది. సురక్షితంగా బయటపడ్డారు.

ప్రస్తుతం ఈ మెగా హీరో విరూపాక్ష సినిమా చేస్తున్నారు. టీజర్ ఆసక్తికరంగా ఉంది. మిగిలిన హీరోలందరూ దూసుకుని పోతున్నారు. అంద‌రు మీడియం రేంజ్ స్టార్లు చేతిలో రెండు మూడు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. హీరోలందరూ వరుస చిత్రాలు చేస్తున్నారు. సాయి ధరంతేజ్ సోదరుడైన వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా వ‌రుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. కానీ సాయి ధరంతేజ్ చేతిలో ఉన్నది విరూపాక్ష చిత్రం మాత్రమే. ఆ చిత్రం రిజల్ట్ ని బట్టి తదుపరి ఎలాంటి చిత్రం చేయాలి అనే విషయంలో ఓ నిర్ణయానికి రావాలని సాయిధరమ్ తేజ్ ఉద్దేశంగా చెబుతున్నారు. మొత్తానికి ఏది ఏమైనా ఈమ‌ద్య త‌న కెరీర్ లో సాయి ధరమ్ తేజ్ కాస్త వెనుక పడ్డాడ‌నే చెప్పాలి. విరూపాక్ష వేసవికి విడుదల కానుంది. నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది క్లారిటీ లేదు.

పవన్‌తోకలిసి స‌ముద్ర‌ఖ‌ని దర్శకత్వంలో వినోదాయ సిత్తం రీమేక్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. అది కనుక ఓకే అయితే మామయ్యతో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్నట్టు అవుతుంది. ముందుగానే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో పడిపోయినట్టే లెక్క. విరూపాక్ష‌ చిత్రం విడుదల తర్వాత సాయి ధరమ్ తేజ్ వ‌రుస చిత్రాలను ఒప్పుకొని బిజీబిజీగా మారాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. మరి విరూపాక్ష అతనికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.