English | Telugu

హాస్పిట‌ల్‌లో సుధ కొంగ‌ర‌.. అస‌లేమైంది?

సుధ కొంగ‌ర హాస్పిట‌ల్‌లో ఉన్నారు. ఒక‌టీ, రెండు రోజులు కాదు, నెల రోజులు మాత్రం ఏ ప‌నీ చేయ‌కూడ‌దు. క‌ద‌ల‌రు. అస‌లేమైంది? అంటారా.. షూటింగ్‌లో ప్ర‌మాదానికి గుర‌య్యారు సుధ కొంగ‌ర‌. ఆమె చేయి విరిగింది. పెద్ద గాయం కూడా అయింది. నెల రోజులు రెస్ట్ త‌ప్ప‌నిస‌రి అని చెప్పార‌ట డాక్ట‌ర్లు. ఈ విశ్రాంతి నేను కోరుకున్న‌ది కాదే. అయినా ఎందుకు ఇప్పుడు ఈ విశ్రాంతి? అంటూ త‌న చేతికి క‌ట్టుకున్న పోస్టు పెట్టారు సుధా కొంగ‌ర‌.

మ‌హిళా ద‌ర్శ‌కులు అన‌గానే ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఎంత వ‌ర‌కు డీల్ చేయ‌గ‌ల‌రు? అనే డౌట్ చాలా మందిలో క‌నిపించేది. అలాంటి డౌట్లు పెట్టుకోకండి అని త‌న సినిమాల‌తో ప్రూవ్ చేసుకున్నారు సుధ కొంగ‌ర‌. గురు నుంచి మొన్న మొన్న‌టి ఆకాశం నీ హ‌ద్దురా వ‌ర‌కు సుధ కొంగ‌ర తీసిన సినిమాల‌న్నీ మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీసే.

సూర్య‌, అపర్ణ బాల‌ముర‌ళి జంట‌గా న‌టించిన ఆకాశం నీ హ‌ద్దురా సినిమాను ఇప్పుడు అక్ష‌య్‌కుమార్ తో హిందీలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ప్ర‌మాదం జ‌రిగి రెస్ట్ మోడ్‌లోకి రావాల్సి వ‌చ్చింది.

సూర్య‌కు సుధ కొంగ‌ర మీద విప‌రీత‌మైన గురి. అందుకే ఇప్పుడు చేస్తున్న 'ద‌రువు' శివ సినిమా పూర్త‌యిన నెల రోజుల త‌ర్వాత ఎట్ ఎ స్ట్రెచ్ సుధ కొంగ‌రికి రెండు నెల‌ల పాటు కాల్షీట్ ఇచ్చేశార‌ట‌. ఈ రెండు నెల‌ల్లో సుధ కంప్లీట్‌గా సూర్య సినిమా షూటింగ్ చేసేస్తార‌ట‌. ఎలాగైనా నెక్స్ట్ ఇయ‌ర్ సంక్రాంతి రేసులో ఆ మూవీని నిల‌పాల‌న్న‌ది టార్గెట్ అట‌. త‌న కెరీర్ పెద్ద‌గా స్పీడ్‌గా లేని టైమ్‌లో త‌న‌కు హెల్ప్ చేసిన సుధ‌తో మ‌రో సినిమాకు రెడీ అయ్యారు సూర్య‌.

ఈ టైమ్ లో సుధ చేతికి గాయ‌మైంది. ఇప్పుడు ఈ ప్లాన్‌లో చేంజ్ ఉంటుందా? లేదా? అనుకున్న ప్ర‌కారం ముందుకు సాగుతారా? అనేది వేచి చూడాల్సిందే.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.