English | Telugu

చరణ్ చాలా సెక్సీ అంట...!

ఇండియాలోని సెక్సీయెస్ట్ స్టార్ హీరోస్ ఎవరు అనే విషయంపై స్టార్ ఇండియా గ్రూప్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ కు 5వ స్థానం దక్కింది. చరణ్ హిందీలో నటించింది ఒకే ఒక్క సినిమా "తుఫాన్". అది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా నటనపరంగా చరణ్ కు అక్కడ మంచి మార్కులే పడ్డాయి. అక్కడ చెర్రీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అయితే ఇందులో భాగంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఈ సర్వేలో అత్యధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. షాహిద్ కపూర్, రణవీర్ సింగ్, వరుణ్ ధావన్‌లు వరుసగా రెండు, మూడు, నాలుగవ స్థానాలు దక్కించుకున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.