English | Telugu

కాంతార ని వెనక్కి నెట్టిన మూవీ.. దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ 

రిషబ్ శెట్టి ప్రస్తుతం 'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)తో రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 350 కోట్ల రూపాయల్ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. చాప్టర్ 1 కాంతార కి ప్రీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. కాంతార కూడా ఎవరి ఊహలకి అందని విధంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. నేటికీ ఓటిటి వేదికగా ఐఎండిబి లో 8 .2 రేటింగ్ తో దూసుకుపోతుంది.

కానీ ఇప్పుడు కాంతార ప్లేస్ ని 'వడ చెన్నై'(vada Chennai)ఆక్రమించింది. ఈ చిత్రం ఐఎండిబి లో 8.4 రేటింగ్‌ని పొందడమే ఇందుకు ఉదాహరణ. 2018 లో విడుదలైన వడ చెన్నై అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. క్రైమ్ డ్రామాగా తెరకెక్కగా, చెన్నై లోకల్ వాతావరణాన్ని ప్రతిభింబించింది. మన ఊహకి అందని విధంగా క్యారక్టర్ లు రన్ అవుతుండటం ఈ చిత్రం స్పెషాలిటీ. సన్నివేశాల్లో ఉత్కంఠత పీక్ లో ఉంటుంది. క్యారక్టర్ లు సైతం సినీ పక్కీలో సాగకుండా, నిత్యం మన కళ్ళ ముందు తిరుగుతుండే విధంగా ఉంటాయి. సదరు క్యారక్టర్ ల వస్త్ర ధారణ కూడా మాములుగా ఉంటుంది. అందుకే విడుదలై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ఓటిటి లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.

కథ విషయానికి వస్తే అంబు క్యారమ్ లో నెంబర్ వన్ ఆటగాడు. కొన్ని పరిస్థితుల కారణంగా స్థానిక మాఫియా ముఠాలో చేరతాడు. దీంతో అతడి జీవితంలో సంభవించిన అనేక మలుపుల ఆధారంగా బేస్ చేసుకొని వడ చెన్నై రూపొందింది. అంబు మాఫియాతో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది అనే విషయం తెలిసాక, ఎంతో థ్రిల్లింగ్ కి లోనవుతాం.చెన్నై స్థానిక రాజకీయాలు కూడా ప్రధాన ఆకర్షణ. వెట్రిమారన్ సహజమైన దర్శకత్వ ప్రతిభకి చూపు కూడా పక్కకి తిప్పుకోము. అంబుగా ధనుష్ నటన ఒక రేంజ్ లో ఉంటుంది.ధనుష్ అగ్ర హీరో అవ్వడానికి కూడా ఈ చిత్రం ఒక కారణం. మిగతా క్యారక్టర్ లలో చేసిన ఐశ్వర్య రాజేశ్,ఆండ్రియా జెరెమియా, డేనియల్ బాలాజీ, సముద్ర ఖని, అమీర్ వంటి ప్రతిభావంతుల నటన కట్టిపడేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .