English | Telugu

సారీ.. నేను చదువుకోవాలి!

"లీడ‌ర్" సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ రిచాగంగోపాధ్యాయ త్వరలోనే సినిమాలకు స్వస్తి చెప్పనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధంగా వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తనే మీడియా ద్వారా తెలిపింది.

ఈ సంధర్భంగా రిచా మాట్లాడుతూ... "నేను సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నాను. ఈ విషయంపై ఒకటిన్నర సంవత్సరం నుండి ఆలోచించాను. సినిమా ఇండస్ట్రీ లో నాకు ఇపుడు చాలా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ నేను పై చదువుల కోసం మాత్రమే అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. ఇందులో ఎవరి బలవంతం లేదు. తెలుగు, త‌మిళం, బెంగాలీ సినిమాల్లో నటించి మంచి నటులతో, దర్శకులతో పని చేశాను. వారితో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.

2008లో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బెస్ట్ హీరోయిన్ అవార్డ్స్ వ‌స్తాయ‌ని కానీ,రెండు లక్షల మంది ట్విట్టర్ ఫాలోయ‌ర్స్ ఏర్పడతారని ఊహించలేదు.5 సంవత్సరాల త‌ర్వాత తిరిగి నా కుటుంబాన్ని, పాత స్నేహితుల‌ను క‌లుసుకోబోతున్నాను. ట్విట్టర్ ద్వారా నా అభిమానుల‌కు, అంద‌రికీ అందుబాటులో ఉంటాను. వీలున్నప్పుడల్లా ఇక్కడికి వ‌స్తుంటాను” అని చెప్పింది.

రిచా ప్రస్తుతం నాగార్జున హీరోగా నటించిన "భాయ్" చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈ 25న విడుదలకు కానుంది. మరి రిచా తన చదువు పూర్తి అయిన తర్వాత మళ్ళీ తిరిగి సినిమాల్లోకి వస్తుందో లేదో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.