English | Telugu

ట్విట్ట‌ర్‌లో రేణు దేశాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

'బ‌ద్రి', 'జానీ' చిత్రాల హీరోయిన్‌గా కంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బెట‌ర్ హాఫ్ గానే రేణు దేశాయ్ తెలుగువారికి సుప‌రిచితం. ప‌వ‌న్‌తో రెండు సినిమాల్లో న‌టించిన ఏకైక హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రేణు.. ప‌వ‌న్‌తో స‌హ‌జీవ‌నం చేసినా, వివాహం చేసుకున్నా, విడిపోయినా ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. ప‌వ‌న్ నుంచి విడిపోయాకా.. ట్విట్ట‌ర్ రూపంలో రేణు మీడియా వారికి ద‌గ్గ‌రైంది. దాంతో ఆమె చేస్తున్న ప్ర‌తి పోస్ట్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ ప‌డుతోంది. అలా ఫోక‌స్ అయిన లేటెస్ట్ పోస్ట్ ఏమిటంటే.. సెకండ్ మ్యారేజ్ గురించి ఆమె చెప్పుకొచ్చిన మాట‌లు. 'పెళ్లి అనేది జీవితంలో ఒక‌సారే జ‌ర‌గాలి. ఇది అనాదిగా భార‌తీయ సంస్కృతిలో ఉన్న వ్య‌వ‌హారం. అయితే ఈ మ‌ధ్య కాలంలో విలువ‌లు మార‌డంతో.. విడాకులు తీసుకుని మ‌రో పెళ్లికి సిద్ధ‌ప‌డ‌డం మాములైపోతోంది. పిల్ల‌లున్న మ‌గాడు మ‌రో పెళ్లి చేసుకోవ‌డం పెద్ద స‌మ‌స్య కాదు కానీ.. అదే ఆడ‌దాని విష‌యంలో మాత్రం అది సుల‌భ‌మైన విష‌యం కాదు. అంతే కాదు.. ఒక స్త్రీ ఎప్పుడు త‌ల్లి అవుతుందో అప్పుడే ఆమెలోని మిగిలిన ఎమోష‌న్స్ అన్నీ చ‌చ్చిపోతాయి' అని ఆమె రాసుకొచ్చింది. కొద్ది రోజుల క్రిత‌మే 'నాకు పుట్టిన పిల్ల‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిల్ల‌లుగా కంటే నా పిల్ల‌లుగానే స‌మాజంలో ఎదిగేందుకు ఇష్ట‌ప‌డ‌తాను' అనే త‌ర‌హాలో ట్విట్ట‌ర్‌లో తెలిపింది రేణు. ఆత్మాభిమానం ఉన్న స్త్రీశ‌క్తికి రేణు దేశాయ్‌ నిలువుట‌ద్దంలా ఉందంటున్నారు ఈ వ్యాఖ్య‌ల్లో భావాన్ని అర్థం చేసుకున్న వారంతా.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .