English | Telugu

ఆర్ సి బి గెలుపు పై రష్మిక ట్వీట్ చేసిందా!.. సువాసనలు వెదజల్లుతున్నాయి  

'ఛలో' మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన 'రష్మిక'(Rashmika Mandanna)ఆ తర్వాత గీత గోవిందం, పుష్ప పార్ట్ 1 , పార్ట్ 2 ,యానిమల్, చావా, వారిసు' వంటి బహు బాషా చిత్రాలతో అనతి కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్ స్టేటస్ ని పొందింది. ప్రస్తుతం 'కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రీసెంట్ గా ఐపిఎల్ 18(IPL 18)వ సీజన్ కి సంబంధించిన ట్రోఫీని 'రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు'(Rcb)గెలుచుకున్న విషయం తెలిసిందే. పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బెంగుళూరు జట్టు ఫైనల్లో గెలిచి కప్పు అందుకోవడంతో కన్నడ నటీనటులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తు ట్వీట్ లు చేస్తున్నారు. ఈ కోవలోనే రష్మిక తన ట్వీట్ లో 'ఇక్కడ గెలుపు సువాసనలు విరజిమ్ముతున్నాయి అని పేర్కొంది.

కొన్ని నెలల క్రితం రష్మిక ఒక ఈవెంట్ లో మాట్లాడుతు' తాను హైదరాబాద్(Hyderabad)కి చెందిన అమ్మాయిని అని చెప్పుకొచ్చింది. దీంతో కన్నడ సంఘాలు రష్మిక పై మండి పడుతు ' కన్నడ నాట పుట్టి పెరిగి, కన్నడ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నువ్వు , కన్నడ రాష్టానికి చెందిన అమ్మాయిని అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు. కన్నడ ద్రోహివి అంటు ఘాటుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో 'ఆర్ సి బి' ని అభినందిస్తు రష్మిక చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రష్మిక స్వస్థలం కర్ణాటక లోని విరాజ్ పేట్. ఇక ఆర్ సి బి గెలవడంపై వెంకటేష్,(venkatesh),అల్లు అర్జున్(Allu Arjun)విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, సాయి దర్గా తేజ్, సుధీర్ బాబు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తు ట్వీట్స్ చేసారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.