English | Telugu

బాలీవుడ్‌లో రానా పేరు చెప్పుకొని..

బాహుబ‌లి తెలుగులో రికార్డులు సృష్టించ‌డం ఖాయ‌మంటున్నారంతా. ఈ సినిమా దాదాపుగా రూ.100 కోట్లు సాధించే అవ‌కాశం ఉంద‌ని అప్పుడే ట్రేడ్ పండితులు లెక్క‌లేసుకొంటున్నారు. బాహుబ‌లికి వ‌చ్చిన హైప్ దృష్ట్యా ఈ సినిమా ఎలా ఉన్నా చూసేద్దామ‌ని ఆడియన్స్ ఫిక్స‌య్యింటారు. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వంద కోట్ల మార్క్ దాటే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. అయితే ఈ సినిమాకి వంద కోట్లు వ‌చ్చినా.. నిర్మాత సేఫ్ జోన్‌లో ప‌డిన‌ట్టు కాదు. ఎందుకంటే ఈ సినిమాకి పెట్టుబ‌డే 150 నుంచి 200 కోట్లు అంటున్నారు.

అందుకే బాహుబ‌లి ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. అక్క‌డ వ‌సూళ్లు ఈ సినిమాకి ప్ల‌స్ అయ్యే అవ‌కాశాలున్నాయి. అందుకే క‌ర‌ణ్‌జోహార్‌లాంటి నిర్మాత‌ను ప‌ట్టుకొని బాలీవుడ్‌లో ప్ర‌చారం భారీగా చేసుకొంటున్నారు. అయితే అక్క‌డ ఈ సినిమా సేల్ అయ్యేది.. రానా పేరుతోటే. 'రానా న‌టించిన బాహుబ‌లి' అంటూ ఈ సినిమాకి ప్ర‌చారం తీసుకొస్తున్నారు.

ఎందుకంటే అక్క‌డ ప్ర‌భాస్ అంటే ఎవ‌రో తెలీదు. రానా మాత్రం మూడు సినిమాల్లో న‌టించాడు. తాజాగా అత‌ను న‌టించిన బేబీ బాలీవుడ్లో ఘ‌న విజ‌యం సాధించింది. త‌మ‌న్నా పోస్ట‌ర్లూ అక్క‌డి జ‌నాన్ని ఆక‌ట్టుకొంటున్నాయి. సో... బాహుబ‌లి హీరో ప్ర‌భాసే అయినా.. బాలీవుడ్‌లో మాత్రం రానా పేరు చెప్పుకొని బిజినెస్ చేసుకొంటోంది చిత్ర‌బృందం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.