English | Telugu

రజనీకాంత్ రాణా 4 నెలలు వాయిదా

రజనీకాంత్ "రాణా" 4 నెలలు వాయిదా పడిందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మించాల్సిన భారీ బడ్జెట్ త్రిభాషా చిత్రం "రాణా" నాలుగు నెలల పాటు వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. రజనీకాంత్ "రాణా" ప్రారంభమైన రోజునే ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత ఒకే నెలలో మూడుసార్లు ఆయన హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం హీరో రజనీకాంత్ సింగపూర్ లో హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. రజనీకాంత్ పూర్తిగా కోలుకుని తిరిగి పూర్తిస్థాయిలో సినిమాల్లో నటించే శక్తి రావటానికి సుమారు నాలుగు నెలలు సమయం పడుతుందని తెలిసింది. రజనీకాంత్ "రాణా" సినిమాలో దీపిక పదుకునే, ఇలియానా డి క్రూజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సౌందర్య రజనీకాంత్ ఈ రజనీకాంత్ "రాణా" సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ని ఎమ్మీ అవార్డ్ విన్నర్ చార్లెస్ డార్బీ పర్యవేక్షణలో అందిస్తారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.