English | Telugu

రామ్ చరణ్ కు యూత్ ఐకాన్ అవార్డ్

రామ్ చరణ్ కు "యూత్ ఐకాన్ అవార్డ్" లభించింది. వివరాల్లోకి వెళితే "నాట్స్" (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) వారు ఈ "యూత్ ఐకాన్" అవార్డుని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇవ్వనున్నారు. రామ్ చరణ్ కు "యూత్ ఐకాన్ అవార్డ్" ని జూలై ఒకటి, రెండు, మూడు తేదీల్లో నార్త్ అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో జరిగే "నాట్స్" (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) వేడుకల్లో వారు వేదికపై అందించనున్నారు.

నాట్స్ వారు రామ్ చరణ్ కు ఈ "యూత్ ఐకాన్ అవార్డ్" ఇవ్వటంపై స్పందిస్తూ రామ్ చరణ్ నటించింది మూడు సినిమాల్లోనే అయినా, మొదటి సినిమా "చిరుత" మంచి హిట్ చిత్రంగా పేరు తెచ్చుకోగా, రెండవ చిత్రం" మగధీర" 75 యేళ్ళ తెలుగు సినీ పరిశ్రమ బాక్సాఫీసు రికార్డులని బద్దలు కొట్టటం సామాన్య విషయం కాదనీ, అందుకు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిలా నిరంతరం రామ్ చరణ్ కష్టపడే మనస్తత్వం, అకుంఠిత దీక్ష ఉండటం వల్లే ఈ రికార్డుని రామ్ చరణ్ సాధించాడనీ అన్నారు. అందుకనే అతనికి యువతలో అంత భారీ ఫాలోయింగ్ ఉందనీ అన్నారు. ఈ సందర్భంగా తెలుగువన్ రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలుపుతోంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.