English | Telugu

దాసరిని తప్పుబట్టిన రామ్ చరణ్

దాసరిని తప్పుబట్టిన రామ్ చరణ్ అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే యువహీరో రామ్ చరణ్ 2010 ఫిలిం ఫేర్ అవార్డుల ఫంక్షన్ కు సంబంధించిన ప్రెస్ మీట్ లో పార్క్ హోటల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ "అవార్డు ఫంక్షన్ లకు హీరోయిన్లు రారని దాసరి అన్నారు. దీనిమీద మీస్పందనేంటి...?" అని అడగ్గా, దానికి రామ్ చరణ్ చాలా దూకుడుగా, సూటిగా సమాధానం చెప్పారు. ఆ సమాధానం ఇలా ఉంది.

" పోయిన సారి ఫిలిం ఫేర్ ఫంక్షన్ కు నేను కూడా వెళ్ళాను. అక్కడికి హీరోయిన్లు అందరూ వచ్చారు. దాసరి పొరపాటున అని ఉంటారు. హీరోయిన్లు అవార్డు ఫంక్షన్లకు రారనటం కరెక్ట్ కాదు. దాసరి ఈ విషయంలో రాంగ్ అని నా అభిప్రాయం. ఇక మీరడిగిన తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా ఎందుకు తీసుకోరు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే మేము చాలా మంది తెలుగమ్మాయిలను ఆడిషన్ చేశాము. కానీ వాళ్ళల్లో సినిమా హీరోయిన్ కు కావలసిన తెగింపు లేదు. అంటే వాళ్ళకి ఇంకా సిగ్గూ, మొహమాటం, బిడియం ఇలాంటివి చాలా ఉన్నాయి. బహుశా వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు లేదా మన సంస్కృతి, సాంప్రదాయాల వల్ల కావచ్చు వాళ్ళు హీరోయిన్లు కావటానికి అభ్యంతరాలుగా ఉన్నాయి" అని అన్నారు. గతంలో రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ ఏనాడూ ఎవరినీ ఇంత ఘాటుగా విమర్శించిన దాఖలాలు లేవు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.