English | Telugu

ప్ర‌భాస్‌.. రానా.. డామినేషన్ ఎవ‌రిది?

రాజ‌మౌళి సినిమాల్లో భ‌యంక‌ర‌మైన ప్ర‌తినాయ‌కుల్ని చూశాం. ఆయ‌న సినిమాల్లో దాదాపుగా విల‌న్ల డామినేష‌న్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఇప్పుడు బాహుబ‌లిలోనూ రానా ప్ర‌భాస్‌ని డామినేట్ చేశార‌న్న టాక్ వినిపిస్తోంది. `బాహుబ‌లి`లో ప్ర‌భాస్ కంటే రానాకే ఎక్కువ ప్రాముఖ్య‌త ఉంద‌ని, రానా ప్ర‌భాస్‌ని అన్నివిధాలా డామినేట్ చేశార‌ని చెప్పుకొంటున్నారు. దానికి తోడు ప్ర‌చార చిత్రాల్లోనూ ప్ర‌భాస్ కంటే రానానేఎక్కువ చూపిస్తున్నారు.

ఇదే విష‌యాన్ని ప్ర‌భాస్‌ని అడిగితే.. `ట్రైల‌ర్‌లో న‌న్ను కూడా బాగానే చూపించారు క‌దా, మీకు అలా అనిపిస్తోందా`` అంటూ లైట్ తీసుకొన్నాడు. మ‌రోవైపు రానా మాత్రం `ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియ‌న్ స్ర్కీన్‌పై ఎవ్వ‌రూ చూడ‌ని విల‌న్‌ని మీరు భ‌ళ్లాల‌దేవ‌లో చూస్తారు. రాజ‌మౌళి సృష్టించిన విల‌న్ల‌లో అతి శ‌క్తిమంతుడు భ‌ళ్లాల‌దేవ‌నే` అంటున్నాడు. దీన్ని బ‌ట్టి రానా ఆధిప్య‌తం ఈ సినిమాలో ఎంత వ‌ర‌కూ ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ సినిమా విష‌యంలో డి. సురేష్ బాబు కూడా ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్నాడు. బాహుబ‌లిలో సురేష్ బాబు భాగ‌స్వామ్య‌మూ ఉంద‌న్న‌ది విశ్వస‌నీయ వ‌ర్గాల టాక్‌. అందుకే రానాని ఈ సినిమాలో బాగా ప్ర‌మోట్ చేశాడ‌ట రాజ‌మౌళి. ఈ విష‌య‌మే ప్ర‌భాస్ అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. ఇది రానా సినిమానా? ప‌్ర‌భాస్ సినిమానా? అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఈ అనుమానాలు తీరాలంటే.. జులై 10 వ‌ర‌కూ ఆగాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.