English | Telugu

రామ్ చరణ్ షేర్వాణీ 1.5 లక్షలట

మెగాస్టార్ ఏకైక తనయుడు, నట వారసుడు అయిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పెళ్ళికొడుకవుతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు ఉపాసనతో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు గండిపేట సమీపానకల ఫాం హౌస్ లో అతి కొద్దిమంది సినీ, రాజకీయ ముఖ్యులు, సన్నిహిత బంధువుల సమక్షంలో వీరి వివాహానికి నిశ్చయతాంబూలాలు పుచ్చుకుంటున్నారు.ఈ ఎంగేజ్ మేంట్ కోసం బెల్జియం నుండి పది కోట్ల ఖరీదు చేసే వజ్రపుటుంగరాన్ని, బ్యాంకాక్ నుండి పూలను తెప్పించిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.

ఈ ఫంక్షన్ కోసమ రామ్ చరణ్ వేసుకోబోయే షేడర్వాణీ ఖరీదు కూడా ఘనంగానే ఉంది. ఆడ్రస్ ఖరీదు ఒకటిన్నర లక్షల రూపాయలట. పెళ్ళి కొడుకు డ్రెస్సే ఇంత ఖరీదుంటే మరి పెళ్ళి కూతురు ఉపాసన డ్రెస్ ఇంకెంత ఖరీదు ఉంటుందో మీరే ఊహించండి. మొత్తానికి ఈ వివాహం నభూతో నభవిష్యతి అన్న చందంగా ఉండబోతూందన్నది మాత్రం యదార్థం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.