English | Telugu

"డమరుకం"లో అఘోరాగా నాగార్జున

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం "డమరుకం". ఈ చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని చోటా.కె.నాయుడు నిర్వహిస్తున్నారు. యాభై నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉండే ఈ చిత్రం బడ్జెట్ 50 కోట్లు. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రాలన్నింటిలోకీ ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రం.

హీరో కింగ్ అక్కినేని నాగార్జున ఆటో డ్రైవర్ గా ఒక పాత్రలో నటిస్తున్నఈ చిత్రంలో అఘోరాగా కూడా కనిపించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ప్రస్తుతం ఆ పాత్ర తాలూకు మెకప్ ట్రైయిల్స్ జరుగుతున్నాయట. "నాగవల్లి" చిత్రంలో విక్టరీ వెంకటేష్ అఘోరాగా కనిపించారు. ఈ "డమరుకం" చిత్రం వేసవి శలవుల కానుకగా వచ్చే సంవత్సరం విడుదల కానుందట.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.