English | Telugu
చిరంజీవికి ఇంకా 26 ఏళ్ళే..!!
Updated : Aug 22, 2015
ఎంత మంచి విషయాన్నయినా మెలికపెట్టి తనవైపు లాక్కోవడం రాముకి 'ట్వీటు'తో పెట్టిన విద్య కాబట్టి.. ఈసారి కూడా చిరంజీవి బర్త్ డే విషెస్ వెరైటీగా ట్వీటాడు. ఇలా ప్రారంభిస్తూ.. 'చిరంజీవి గారూ నేనెవరికీ బర్త్ డే విషెస్ చెప్పను. కానీ మీ పుట్టుక మా జన్మలకు అద్భుతమైన ఆనందాన్నిచ్చింది. కాబట్టి మీ జన్మదినం సందర్భంగా మాకు ఈ జన్మ వచ్చినందుకుగానూ మాకు మేమే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం' అన్నాడు వర్మ. ఈ ట్వీటుకు కొనసాగింపుగా 'మీ చుట్టూ ఉన్నవారందరూ మీకు 60 ఏళ్లు వచ్చిందని ఎంతగానో అడ్వర్టైజ్ చేస్తున్నా సరే మీరు మాత్రం మాకెప్పటికీ 26 ఏళ్ల చిరంజీవే' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ షష్ఠి పూర్తిని చూస్తుంటే ఆయన కుటుంబ సభ్యులే ఆయన్ను రిటైర్ అయిపోండి అన్నట్లుందని చివరగా బాంబు పేల్చాడు.