English | Telugu

రచ్చ లో రామ్ చరణ్ ఫైటింగ్

"రచ్చ" లో రామ్ చరణ్ ఫైటింగ్ చేస్తున్నాడట. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీవైట్ బ్యుటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" సినిమా ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రచ్చ". ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. గచ్చిబౌలి సమీపాన కల అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ "రచ్చ" సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ "రచ్చ" సినిమాలో ప్రస్తుతం కొన్ని తెలంగాణా జిల్లాల్లో బర్నింగ్ ప్రోబ్లెమ్ గా ఉన్న ఫ్లోరైడ్ సమస్య గురించి చర్చించారట. "రచ్చ" సినిమా షుటింగ్ కథాపరంగా శ్రీలంకలో కూడా జరుపుతారట. ఈ "రచ్చ" సినిమాని వీలయినంత వేగంగా పూర్తిచేయాలని ఈ చిత్ర దర్శకుడు సంపత్ నంది కృషి చేస్తున్నట్లు సమాచారం. ఈ "రచ్చ" సినిమా కోసమే హీరో రామ్ చరణ్ అమెరికాలోని మియామీలో కల ఒక అమతర్జాతీయ జిమ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.