English | Telugu

కామినేని ఉపాసన, రామ్ చరణ్ దగ్గరవుతున్నారా...?

కామినేని ఉపాసన, రామ్ చరణ్ దగ్గరవుతున్నారా...? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళితే మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి ఏకైక కుమారుడూ, ఆయన నటవారసుడూ అయిన యువహీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గతంలో కానినేని ఉపాసనతో ప్రేమలో పడ్డాడన్న వార్తలు వచ్చాయి. కానీ కామినేని ఉపాసన నాకు ఒక మంచి స్నేహితురాలు మాత్రమేనని రామ్ చరణ్ ఆ మాతలను కొట్టి పారేశాడు. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే కామినేని ఉపాసన కుటుంబం చిరంజీవి ఇంటికి వచ్చి కామినేని ఉపాసన, రామ్ చరణ్ పెళ్ళి విషయం చర్చలు చేసిందని విశ్వసనీయ వర్గాలద్వారా అందిన సమాచారం.

కామినేని ఉపాసన కూడా రామ్ చరణ్ తో మాట్లాడిందట. వీళ్ళిద్దరి మధ్య పాజిటీవ్ దృక్పధంతోనే పెళ్ళికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయట. 23 యేళ్ళ ఉపాసన తాతయ్య డాక్టర్ ప్రతాప్.సి.రెడ్డి అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి ఫౌండర్ చైర్మన్ కావటం విశేషం. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. అయితే కామినేని ఉపాసన, రామ్ చరణ్ ల పెళ్ళి గురించి మెగా ఫ్యామిలీ ఇంతవరకూ అధికారికంగా ఏ విషయం ప్రకటించలేదు.