English | Telugu

డ్రగ్స్ కేసులో అగ్ర హీరోయిన్ సోదరుడి పరారీ.. గాలింపు చేపట్టిన ఈగల్


-ప్రముఖ హీరోయిన్ సోదరుడి పరారీ
-దొరుకుతాడా లేదా
-విచారణలో డ్రగ్ డీలర్స్ సంచలన నిజాలు

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి చెందిన 'ఈగల్' (EAGLE - Elite Action Group for Drug Law Enforce ment) బృందం డ్రగ్స్ కేసులో దర్యాప్తుని ముమ్మరం చేసింది. డ్రగ్స్ క్రయవిక్రయాలు చేసే వారిపై కొరడా ఝళిపిస్తున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో గుర్తింపు పొందిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు అమర్ ప్రీతి సింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది.

ఈగల్ బృందం, మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేశారు.వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్ మరియు 11.5 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చేయగా తమ వద్ద నుండి రెగ్యులర్ గా నలుగురు కస్టమర్లు డ్రగ్స్ కొనుగోలు చేస్తారని వారిలో రకుల్ సోదరుడు అమర్ ప్రీతి సింగ్ ఒకరని డ్రగ్ డీలర్స్ చెప్పుకొచ్చారు. అతనికి డ్రగ్స్ డెలివరీ కావాల్సి ఉండగా అదే సమయంలో పోలీసులు ఆపరేషన్ చేసి అడ్డుకున్నారని సమాచారం.


రకుల్ సోదరుడు గత సంవత్సరం కూడా సైబరా బాద్ పోలీసులకి పట్టు బడ్డాడు. అప్పుడు నిర్వహిం చిన పరీక్షల్లో అతడు కొకైన్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా వ్యాపారులను అరెస్టు చేసిన విషయం తెలియగానే అమర్ ప్రీతి సింగ్ ఎవరికీ అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞా తంలోకి వెళ్ళి పోయాడు. ఇద్దరు నిందితుల వాంగ్మూ లంలో అమర్ పేరు డీలర్స్ చెప్పినా పోలీసులు అమర్ ని ఇంకా అధికారికంగా నిందితుడిగా చేర్చలేదు. కానీ ఈగల్ టీమ్ అతని కోసం గాలిస్తున్నారు.



టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.