English | Telugu

Patang Review: పతంగ్ మూవీ రివ్యూ

తారాగణం: ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్, అను హాసన్ తదితరులు
సంగీతం: జోస్ జిమ్మీ
డీఓపీ: శక్తి అరవింద్
ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పు
రచన, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటి
నిర్మాణం: నాని బండ్రెడ్డి ప్రొడక్షన్
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2025

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన సినిమాలలో 'పతంగ్' ఒకటి. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే..? (Patang Movie Review)

కథ:
హైదరాబాద్ లోని బస్తీ కుర్రాడు విస్కీ అలియాస్ వంశీ కృష్ణ (వంశీ పూజిత్), సంపన్న కుటుంబానికి చెందిన అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. ఆమెది కన్‌ఫ్యూజింగ్ మైండ్ సెట్. ఏ విషయంలోనూ క్లారిటీగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి ఐశ్వర్య, మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అరుణ్ ని కూడా ఇష్టపడుతుంది. ఐశ్వర్య రాకతో విస్కీ, అరుణ్ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్ల ప్రాణ స్నేహితుల మధ్య విభేదాలు వచ్చాయా? చివరికి ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
తెలుగు ప్రేక్షకులకు ముక్కోణపు ప్రేమ కథలు కొత్త కాదు. ఈ తరహా కథలు ఇప్పటికే ఎన్నో చూశాము. అయితే ఎక్కువగా.. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం చూస్తుంటాం. కానీ, ఇందులో అమ్మాయే తన కన్‌ఫ్యూజింగ్ మైండ్ సెట్ కారణంగా ఒకేసారి ఇద్దరు అబ్బాయిలను ఇష్టపడుతుంది. అదే ఇందులో ఆసక్తికర పాయింట్.

పతంగ్ కథ చాలా చిన్నది. అయినప్పటికీ దర్శకుడు తనదైన కథనంతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. సహజమైన సన్నివేశాలతో, సున్నితమైన హాస్యంతో సినిమాని నడిపించిన తీరు అభినందనీయం. ఫస్ట్ హాఫ్ మనకు తెలియకుండానే సరదాగా నడిచిపోతుంది. విస్కీ-అరుణ్ ఫ్రెండ్ షిప్, విస్కీ-ఐశ్వర్య ప్రేమ కథ, అరుణ్ ని కూడా ఐశ్వర్య ఇష్టపడటం వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ నవ్వులను పంచుతుంది.

రెండు వస్తువులు ఎదురుగా ఉంటేనే ఏది సెలెక్ట్ చేసుకోవాలని కన్‌ఫ్యూజ్ అయ్యే అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిలలో జీవిత భాగస్వామిగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది అనే ఆసక్తిని రేకెత్తిస్తూ.. కథ సెకండ్ హాఫ్ లోకి అడుగుపెడుతుంది. సెకండ్ హాఫ్ ప్రధానంగా పతంగ్ పోటీ చుట్టూనే తిరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తాయి. అయితే మెయిన్ పతంగ్ పోటీ మాత్రం మెప్పించింది. ముఖ్యంగా విష్ణు ఓఐ కామెంటరీ ఆ ఎపిసోడ్ కి బలంగా నిలిచింది. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి.

యూత్ ఫుల్ సినిమాలంటే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్ లతో నిండిపోయి.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి ఇబ్బందిపడేలా ఉంటాయి. పతంగ్ మూవీ టీమ్ ఆ తప్పు చేయలేదు. కుటుంబంతో కలిసి చూసేలా ఈ సినిమాని మలిచారు. ఈ సినిమాకి మెయిన్ మైనస్ ఏదైనా ఉందంటే.. నిడివి ఎక్కువ ఉండటమే. కనీసం 10-15 నిమిషాలు ట్రిమ్ చేసినట్లయితే.. మూవీ క్రిస్పీగా, మరింత మెరుగ్గా ఉండేది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నటీనటులు కొత్తవారే అయినప్పటికీ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. కన్‌ఫ్యూజింగ్ మైండ్ సెట్ ఉన్న ఐశ్వర్య పాత్రలో ప్రీతి పగడాల మెప్పించింది. బస్తీ కుర్రాడిగా వంశీ పూజిత్, రిచ్ కిడ్ గా ప్రణవ్ కౌశిక్ చక్కగా రాణించారు. విష్ణు ఓఐ ఉన్నంతసేపు బాగానే నవ్వించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్, అను హాసన్ తదితరులు పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతికంగానూ పతంగ్ మెప్పించింది. జోస్ జిమ్మీ సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతంతో మ్యాజిక్ చేశాడు. శక్తి అరవింద్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. చాణక్య రెడ్డి ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయొచ్చు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా..
తెలిసిన కథే అయినప్పటికీ.. ఫ్యామిలీతో కలిసి చూసి, కాసేపు సరదాగా నవ్వుకునేలా ఉంది ఈ 'పతంగ్'.

రేటింగ్: 2.75/5

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.