English | Telugu

తానాకి.. మ‌హేష్ ఝ‌ల‌క్‌!!

ఈయేడాది జులైలో అమెరికాలో జ‌రిగే తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) వేడుక‌ల‌కు మ‌హేష్ బాబు హాజ‌ర‌వుతాడ‌ని, ఈ వేడుక‌ల‌కు పిలిచినంద‌కు మ‌హేష్ రూ.1.5 కోట్లు డిమాండ్ చేశాడ‌ని వార్తలొచ్చాయి. ఈ డ‌బ్బుని ఓ ఛారిటీకి మ‌హేష్ అందించాడ‌నికి కూడా చెప్పుకొన్నారు. అయితే ఇప్పుడు తానా వేడుక‌ల‌కు మ‌హేష్ వెళ్ల‌డం లేద‌ట‌. దానికి కార‌ణం.. ర‌హ‌స్యంగా ఉంచాల్సిన విష‌యాలు సైతం తానా ద్వారానే బ‌య‌ట‌కు పొక్కినందుకు మ‌హేష్ సీరియ‌స్ అయ్యాడ‌ని తెలిసింది. రూ.1.5 కోట్లు మహేష్‌కి ముట్ట‌జెప్పిన విష‌యం మీడియాకు లీక‌వ్వ‌డంపై మ‌హేష్ చాలా సీరియ‌స్‌గా ఉన్నాడ‌ట‌. తానా స‌భ్యులే ఈ విష‌యాన్ని మీడియాకు లీక్ చేశార‌ని మ‌హేష్ భావిస్తున్నాడ‌ట‌. అందుకే మీ ఉత్స‌వాల‌కు వ‌చ్చేది లేద‌ని తెగేసి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మ‌హేష్ నిర్ణ‌యంపై తానా ఆందోళ‌న వ్యక్తం చేస్తోంది. ఎలాగైనా స‌రే.. మ‌హేష్‌ని తానాకు ర‌ప్పించ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. అవ‌స‌ర‌మైతే మ‌హేష్‌కి క్ష‌మాప‌ణ చెప్ప‌యినా స‌రే.. ఈ వ్య‌వ‌హారం స‌ర్దుబాటు చేయాల‌ని భావిస్తోంద‌ని స‌మాచారం. మ‌రి మ‌హేష్ క‌రుగుతాడో లేదో..?

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.