English | Telugu

జూలైలో చెన్నై రానున్న రజనీకాంత్

జూలైలో రజనీకాంత్ చెన్నై రానున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. రజనీ కాంత్ తాను హీరోగా, దీపిక పదుకునే, ఇలియానా హీరోయిన్లుగా, కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో, 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న"రాణా" సినిమా ప్రారంభోత్సవానికి వెళ్ళి, అనుకోకుండా సుస్తీకి గురయ్యారు. ఆ తర్వాత నెలలోపే మూడుసార్లు ఆయన హాస్పిటల్ లో చేరాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. ఆ తర్వాత రజనీకాంత్ ని సింగపూర్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో చేర్పించటం జరిగింది.అప్పటి నుండీ రజనీకాంత్ డాక్టర్ల పర్యవేక్షణలో సింగపూర్ లోనే ఉన్నారు. ఆయన్ని ప్రతిరోజూ రెండు పూటలా డాక్టర్లు పరిశీలిస్తున్నారు.

ఆయన త్వరగానే కోలుకుంటున్నారనీ, ఆయన జూలై 9 వ తేదీన కానీ, లేదా జూలై నెల చివరలో కానీ చెన్నైకి వచ్చే అవకాశముంది. డాక్టర్లు రజనీ కాంత్ త్వరగా కోలుకోవటానికి పప్పుధాన్యాలూ, పళ్ళరసాలూ ఇస్తున్నారట. ఆయన కోలుకున్న తర్వాత చెన్నాన్నైకి వచ్చినా ఆయన అభిమానులు ఆయన్ని సరిగ్గా విశ్రాంతి తీసుకోనివ్వరనీ, అందుకనే ఆయన ఇంకో పదిరోజుల పాటు అక్కడేఉండి, అప్పుడే చెన్నైకి రావలసిందిగా తాను కోరాననీ, ఆయన భార్య ఐశ్వర్య మీడియాకు తెలియజేశారు.