English | Telugu

నాగార్జున రాజన్న తొలి పోస్టర్ విడుదల

నాగార్జున రాజన్న తొలి పోస్టర్ విడుదలయ్యింది. వివరాల్లోకి వెళితే సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టుడియోస్ పతాకంపై, యువసామ్రాట్, కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం "రాజన్న". ఈ చిత్రానికి ప్రముఖ యువ దర్శకుడు యస్.యస్.రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ కథా రచయిత అయిన వి.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో, అనుష్క హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తూంది. రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో తిరుగుబాటు చేసి పోరాడిన తెలంగాణా పోరాట యోధుడు రాజన్న చరిత్రే ఈ "రాజన్న" చిత్ర కథాంశం.

ఈ చిత్రానికి దర్శకత్వం విజయేంద్ర ప్రసాద్ వహిస్తున్నా, ఈ "రాజన్న" చిత్రంలోని యాక్షన్ సీన్లను మాత్రం రాజమౌళి నేతృత్వంలో చిత్రీకరిస్తారు. నాగార్జున "రాజన్న" చిత్రానికి యమ్ యమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. నాగార్జున "రాజన్న" చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, రామ్-లక్ష్మణ్ యాక్షన్ సీన్లను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. "రగడ" చిత్రం తర్వాత వస్తున్న నాగార్జున "రాజన్న" చిత్రం మీద ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున "రాజన్న" పోస్టర్ చూస్తుంటే నాగార్జున ఎంత శక్తివంతమైన పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్నారో అర్థమవుతుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.