English | Telugu

ఫెడరేషన్ సమ్మె విరమణ

ఫెడరేషన్ సమ్మె విరమణ చేసిందని, సినీ కార్మికులంతా మళ్ళీ సినిమా షూటింగుల్లో పాల్గొంటారనీ ఫెడరేషన్ మీడియాకు తెలిపింది. వివరాల్లోకి వెళితే 24 క్రాఫ్టులకు చెందిన సినీ కార్మికుల వేతనాల సవరింపునకు సంబంధించి ఏర్పడిన ప్రతిష్టంభన తొలగింది. తెలుగు సినీ నిర్మాతల మండలి పెంచుతామని చెప్పిన మొత్తానికి ఫెడరేషన్ లోని అన్ని సినీ కార్మికుల సంఘాలూ అంగీకరించినా కొన్ని సంఘాలు అంగీకరించకపోవటం వల్ల సినిమా షుటింగులకు మళ్ళీ ఆటంకం ఏర్పడింది. చివరికి ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మండలి పెంచిన 32 శాతం మొత్తాలకే సినీ కార్మికుల సంఘాలన్నీ సినీ షూటింగుల్లో పాల్గొంటానికి ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. దీని మూలంగా గత 18 రోజులుగా ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

ఈ సమ్మె విరమణ వల్ల నిర్మాణం మధ్యలో ఉన్న సినిమాలకు నష్టం వాటిల్లకుండా సినిమాలను అనుకున్న సమయానికే నిర్మాతలు పూర్తి చేయగలుగుతారు. ఫెడరేషన్ సమ్మె విరమించటం అటు సినీ కార్మికులోకూ,ఇటు సినీ నిర్మాతలకూ శుభపరిణామమని సినీ పరిశ్రమలోని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇక భవిష్యత్తులో ఏదైనా ఇలామటి పరిస్థితి వస్తే సమ్మెలు చేయకుండా అందరూ కూర్చుని సమస్య పరిష్కారదిశగా ప్రయత్నాలు చెయ్యాలే గానీ, ఆ సమస్యను మరింత జటిలం చేయకూడదని వారు అభిప్రాయపడ్డారు.