English | Telugu
నందమూరి బాలకృష్ణ హీరోగా రాజమౌళి సినిమా
Updated : Apr 2, 2011
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ పరుచూరి మురళి దర్శకత్వంలోని చిత్రంలో త్రిపాత్రాభినయంతో నటిస్తున్నారు. దీని తర్వాత శ్రీరామరాజ్యం, బి.గోపాల్ చిత్రాలు పూర్తయ్యేసరికి దాదాపు అదే సమయం అవుతుంది. ఈలోగా రాజమౌళి "ఈగ" చిత్రాన్ని, దీని తర్వాత ప్రభాస్ హీరోగా ఒక భారీ జానపద చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం రానున్న నవంబర్ లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం పూర్తయ్యేసరికి కూడా అదే సమయం అవుతుంది. అసలే హీరోని అద్భుతంగా చూపించే రాజమౌళి ఇప్పటికే భయంకరమైన మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణను ఇంకెలా చూపిస్తాడోనని, బాలయ్య అభిమానులూ, సినీ వర్గాలనుకుంటున్నారు.