English | Telugu

యన్ టి ఆర్ న్యూ మూవీ టైగర్

యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీలో "టైగర్" అన్న పేరు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, శృతి హాసన్ హీరోగా, బోయపాటి శీను దర్శకత్వంలో యువ నిర్మాత అలగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రానికి "టైగర్" అన్న పేరు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముందుగా యన్ టి ఆర్ హీరోగా ఈ చిత్రానికి "చురకత్తి" అనే పేరు గానీ లేదా "దమ్ము" అన్న టైటిల్ గానీ పెట్టాలని ఆలోచించారు.

కానీ ఈ రెండింటికన్నా "టైగర్" అన్న పేరే శక్తివంతంగా ఉందని ఈ చిత్రం యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. యన్ టి ఆర్ బాబాయ్ యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా "సింహా" అనే సూపర్ హిట్ సినిమా తీసిన బోయపాటి శీను మరి అబ్బాయ్ యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా తీసే సినిమా ఇంకెంత సూపర్ హిట్ ఇస్తాడినని నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.