English | Telugu
సెకండ్ పార్ట్ పై జక్కన్న క్లారిటీ
Updated : Jul 17, 2015
బాహుబలి పార్ట్-1కి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్..బాహుబలి పార్ట్-2 విషయంలో రాజమౌళి బాధ్యతను పది రెట్లు పెంచింది. అదే సమయంలో తొలి భాగానికి సంబంధించి వచ్చిన విమర్శల్ని కూడా దృష్టిలో ఉంచుకుని రెండో భాగంలో ఎలాంటి లోపాలూ లేకుండా చూసుకోవాలి కూడా. ఈ నేపథ్యంలోనే బాహుబలి.. ది కంక్లూజన్ విషయంలో మార్పులపై రాజమౌళి దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవలే సీఎన్ఎన్-ఐబీఎన్ ఛానెల్లో రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో కూడా బాహుబలి రెండో భాగానికి సంబంధించి మార్పులు చేసే అవకాశాలు లేకపోలేదని రాజమౌళి వెల్లడించాడు. ‘‘బాహుబలి ది బిగినింగ్..కి మొదటి వారం రెస్పాన్స్ అదిరిపోయింది. మా టీం మొత్తం చాలా హ్యాపీగా ఉంది. అయితే సినిమాకు అసలైన టాక్ ఏంటన్నది నాలుగో వారం పూర్తయిన తర్వాతే తెలుస్తుంది. అప్పటి జెన్యూన్ రెస్పాన్స్ బట్టి కథలో మార్పులపై నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పాడు జక్కన్న. అంతే బాహుబలి పార్ట్-2 మార్పులకు రాజమౌళి టీం దృష్టి పెట్టిందనమాట.