English | Telugu

శ‌భ్బాష్ .. లారెన్స్‌!!


అమ్మ‌ను మించి దైవమున్న‌దా.... అంటూ పాట‌ల‌కే ప‌రిమితం కాలేదు. చేత‌ల్లో చేసి చూపిస్తున్నాడు రాఘ‌వేంద్ర లారెన్స్‌. ఏకంగా అమ్మ‌ని గుళ్లో దేవ‌త‌గా ప్ర‌తిష్టించ‌బోతున్నాడు. అమ్మ కోసం ఓ గుడి క‌డుతున్నాడు. ఈరోజు (బుధ‌వారం) లారెన్స్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మాతృ మూర్తి కోసం త‌న స్వ‌గ్రామ‌మైన మేవ‌లూర్ కుప్పంలో అమ్మ కోసం ఓ గుడి క‌ట్టేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నాడు లారెన్స్‌. ''నా దృష్టిలో మా అమ్మ ఓ దేవ‌త‌. నా కోసం ఎంత శ్ర‌మించిందో నాకు తెలుసు. తాను లేని జీవితాన్ని ఊహించుకోలేను. తాను నా క‌ళ్ల‌ముందు ఉండ‌గానే ఆమెను గుడిలో దేవ‌త‌గా చూడాల‌నుకొంటున్నా. వ‌చ్చే యేడాది నా పుట్టిన రోజున గుడి ప్రారంభిస్తా. అంతే కాదు, అమ్మ కోసం ఓ పుస్త‌కం రాస్తున్నా. అదే రోజున ఆ పుస్త‌కం కూడా విడుద‌ల చేస్తా'' అని చెప్పుకొచ్చాడు లారెన్స్‌. ఓ మంచి ద‌ర్శ‌కుడు, డాన్స్ మాస్ట‌రే కాదు, ఇప్పుడు మంచి కొడుకు అని కూడా అనిపించుకొన్నాడు లారెన్స్‌. అన్న‌ట్టు ఈ దేవాల‌యాన్ని ప్ర‌పంచంలోని మాతృమూర్తులంద‌రికీ అంకితం చేస్తున్నాడు. శ‌బ్బాష్ .. లారెన్స్‌!!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.