English | Telugu

దాసరితో మెగా హీరో ఢీ

టైటిల్ చూసి ఏదోదో ఊహించుకోవొద్దు.. వీరిద్ద‌రి సినిమాలూ ఒకేరోజు రాబోతున్నాయంతే. దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎర్ర‌బ‌స్సు న‌వంబ‌రు 14న విడుద‌ల కాబోతోంది. అదే రోజున మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ సినిమా కూడా వ‌చ్చేస్తోంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా జంట‌గా న‌టించిన చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం. ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని న‌వంబ‌రు 14నే విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించింది. అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ స్వ‌రాలు అందించారు. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్రధారి. సాయి రెండో సినిమా విడుద‌ల కూడా అయిపోతుంటే.. తొలి సినిమా రేయ్ బిక్కు బిక్కుమంటూ ల్యాబుల్లోనే మ‌గ్గుతోంది. మ‌రి ఆ సినిమాకి మోక్షం ఎప్పుడో...??

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.