English | Telugu

ఐస్‌క్రీంకి అయిన ఖర్చు రెండు లక్షలు - రాం గోపాల్ వర్మ


ఐస్‌క్రీం సినిమా తీయడానకి అయిన ఖర్చు అక్షరాలా 2,11,832 మాత్రమేనట. ఈ విషయాన్ని స్వయంగా రాం గోపాల్ వర్మ కన్‌ఫర్మ్ చేశారు. అలాగే 2 లక్షల్లో ఈ సినిమా ఎలా తీశారనే విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా విపులంగా షేర్ చేసుకున్నారు.
అది ఆయన మాటల్లోనే...


"సినిమా అనేది కథ, పెర్ఫార్మన్సెస్ టేకింగ్, సౌండ్, కెమెరా, మ్యూజిక్ ల సమ్మేళనం. ఆ సమ్మేళనం సాదించటానికి యాక్టర్లు, టెక్నీషియన్లతో పాటు వివిధ రకాల ఎక్విప్మెంట్లు అవసరమవుతాయి. సినిమాకి ఖర్చు అనేది యాక్టర్లకి టెక్నీషియన్లకి పేమెంట్ల మూలాన, ఎక్విప్మెంట్లకి లొకేషన్లకి వగైరాలకి ఇచ్చిన రెంట్లు మూలాన...నేను సినిమా మొదట్లోనే యాక్టర్లు, టెక్నీషియన్లు, ఎక్విప్మెంట్ సప్లయర్లు, వగైరాఅందరితో మీటింగ్ పెట్టి "మీకు సినిమా ఆడుతుందని నమ్మకం లేకుండా కేవలం మీకుదొరికే పేమెంట్ కోసం చేస్తున్నారా? లేక మీకు కాన్సెప్ట్ నచ్చి ఆడుతుందనే నమ్మకంతోచేస్తున్నారా?” అని అడిగాను.. దానికి అందరూ నమ్మకంతోనేఅని చెప్పారు. అప్పుడు నేను వాళ్ల పేమెంట్ లు సినిమా హిట్ అయితేనే వస్తాయని చెప్పాను. ఒప్పుకోని వాళ్ళని వొదిలేసి వేరే ఒప్పుకునేవాల్లని వెతికి పెట్టుకోవటం జరిగింది. నేను వాళ్ళందరికీ చెప్పిందేంటంటే వాళ్లు మామూలుగా ఏం ఛార్జ్ చేస్తారో దానికన్నా ఎక్కువ ఇస్తామని.కానీ ఆ పేమెంట్ లాభాలనించి వస్తుంది. అంతే కాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి కాదు.

సినిమాకి లాభమొచ్చిందంటే వాళ్లు చేసిన పని సఫలమయిందని. ఫెయిల్ అయ్యిందంటేవాళ్ల పని విఫలమయిందని. అలా అయితే వాళ్ల వల్ల విఫలమైన పనులకి వాళ్ల జేబుల్లోకిడబ్బులెల్లి, వాళ్ల పనితనాన్ని నమ్మిన ప్రొడ్యూసర్ కి, కొన్న డిస్ట్రిబ్యూటర్ కి మాత్రమే నష్టం ఎందుకు రావాలన్న కాన్సెప్ట్ లోనుంచి వచ్చిందీ thought process.

ఐస్ క్రీం సినిమాలో లైట్లు, ట్రాక్ ట్రాలీలు, జిమ్మీ జిబ్ లు, స్టడీ క్యా౦లు ఏమీవాడలేదు. 70% సినిమా గింబల్ అనే ముందు చెప్పిన వాటన్నిటికంటే చాలా చీపయిన పరికరంతో తియ్యడం జరిగింది. అందుకే విజువల్స్ అంత కొత్తగా ఉన్నాయి. ఇంకా ఫ్లో-క్యా౦ పద్దతిలో సినిమా తియ్యడం మూలాన యూనిట్ లో పని చేసే వాళ్ల సంఖ్య రెగ్యులర్ సినిమా కన్నా90 శాతం తగ్గిపోయింది. షూటింగప్పుడు అందరూ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేసివచ్చేవాళ్లు. లంచ్ ఎవరికి వాళ్లు వాళ్లే తెచ్చుకునేవాళ్లు. నవదీప్,తేజస్విలు సినిమాకోసం వేసుకున్న బట్టలు వాళ్ల సొంత బట్టలు.

స్టార్లు, పాటలు, ఫైట్లు, కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా ఒకే ఒక్క లొకేషన్లో ఇద్దరే ఇద్దరు యాక్టర్లతో తీసిన ఐస్ క్రీం కి ఇంత సూపర్ ఓపెనింగ్స్ ఎందుకొచ్చాయి అనే ప్రశ్నకి ఒకరిచ్చిన సమాధానం రాం గోపాల్ వర్మ పేరుండడం అని.కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా పేరుతోనే ఓపెనింగ్ వస్తే మరి సత్య 2 కెందుకురాలేదు.? అసలు కారణం చాలా సింపుల్. వాళ్లకి సత్య 2 ట్రైలర్ లు, దానికి సంబంధించిన ప్రచారం నచ్చలేదు, ఐస్ క్రీంవి నచ్చాయి.... కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఐస్ క్రీం కి వచ్చిన ఓపెనింగ్ ఏం ప్రూవ్ చేసిందంటే ఆడియన్స్ ని థియేటర్లోకి అట్రాక్ట్ చెయ్యడానికి ప్రొడక్షన్ వాల్యూస్ అవసరంలేదని... కేవలం ఒకఇంట్రెస్టింగ్ ఐడియా చాలని... పైసా ఖర్చులేనిది ఐడియా మాత్రమే. నేను చెప్పేదానికి చివరర్ధం ఏమిటంటే ఐడియా ఉన్నవాడెవ్వడైనా సరే ఆ ఐడియాతో మిగతా వాళ్ళని కన్విన్స్ చెయ్యగలిగితే ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా సినిమా తీసేయ్యొచ్చు.

నేను పైన చెప్పిన 2 లక్షల 11 వేల 8 వందల 32 రూపాయిల ఖర్చు ముఖ్యంగా ఆ ఇంటి రెంట్ కి, టీలకి, కాఫీలకి అయ్యింది. ఆ ఇంటి ఓనర్ సినిమా టీం లో భాగం కాదు కనక ఆ రెంట్ ఖర్చు తప్పలేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఐస్ క్రీం లో ఆ ఇంటిని ప్రెజెంట్ చేసిన విధానం నచ్చి ఐస్ క్రీం 2 లొకేషన్ ఓనర్ ఐస్ క్రీం 2 సినిమా టీంలో తను కూడాభాగమవ్వడానికి ఒప్పుకున్నారు..

ఐస్ క్రీం సూపర్ హిట్ అయ్యి లాభమొచ్చిన మూలాన 15 వ తారీకున ఐస్ క్రీం సక్సెస్మీట్ లో నిర్మాత రామ సత్యనారాయణ గారు పని చేసిన అందరికీ వాళ్ల వాళ్ల పేమెంట్ లు అందజేస్తారు. ఇండస్ట్రీ ఇలాంటి ఒక కొత్త మలుపు తిరుగుతున్న సంధర్బంలోమీరందరూ రావాలని నా రిక్వెస్ట్.

ఐస్ క్రీం ఎలా తయారయ్యిందో ఒక సహకార సంఘం దృష్టితో అర్ధం చేసుకుంటే ఒక సరికొత్త ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే కాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉన్న ప్రతీఊర్లో పుడుతుంది."

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.