English | Telugu

ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థపై ప్రభాస్ కీలక వ్యాఖ్యలు 

పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్(Prabhas)ప్రస్తుతం 'ది రాజాసాబ్'(The Raja Saab)తో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 5 న విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ రాజాసాబ్ పనులని శరవేగంగా పూర్తి చేస్తుంది. ఇటీవల రిలీజైన టీజర్ తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో 'రాజాసాబ్' పై అంచనాలు పెరిగాయి. దీంతో పాటు, హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కూడా ప్రభాస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ''ఫౌజీ' (fauji)అనే పేరుని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది.

ప్రభాస్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'హోంబులే ఫిలింస్' గురించి మాట్లాడుతు కేజీఎఫ్ సినిమా షూటింగ్ టైంలో ఒక భారీ సెట్ వేశారు. అనుకోకుండా ఆ సెట్ కాలిపోయింది.అప్పటికే బడ్జెట్ పరంగా పరిమితులు ఏర్పడటంతో యూనిట్ సభ్యులు ఎంతో టెన్షన్ పడ్డారు. కానీ నిర్మాత 'విజయంగదుర్' మాత్రం మీరందరు ప్రశాంతంగా ఉండండి. డబ్బు సమస్యే కాదు. సినిమా క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావద్దని చెప్పారు. ఆ ధోరణి నాకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు.

2014 లో 'పునీత్ రాజ్ కుమార్'(Puneeth Rajkumar)హీరోగా తెరకెక్కిన 'నిన్నదలే' అనే మూవీతో 'హోంబలే ఫిలింస్' చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 'కేజిఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 , 'కాంతార' తో అనతికాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా పేరు గడించింది. ప్రస్తుతం 'కాంతార చాప్టర్ 1 తో పాటు 'మహావతార నరసింహ'(Mahavatar Narsimha)అనే యానిమేటెడ్ మూవీని నిర్మిస్తుంది. మహావిష్ణువు అవతారాల గురించి చెప్పే ఈ సిరీస్ మొత్తం ఏడూ భాగాలుగా రానుంది. ప్రభాస్ తో ఇప్పటికే 'సలార్ 'ని నిర్మించిన హోంబలే ఫిలింస్ 'సలార్ 2 '(Salaar 2)కూడా నిర్మించబోతున్న విషయం తెలిసిందే.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.