English | Telugu
రవితేజ బ్యాక్..'పవర్'కట్‌లుండవ్
Updated : Aug 27, 2014
వరుస ఫ్లాపుల తర్వాత 'బలుపు' చూపించి బయటపడ్డ రవితేజ ఇప్పుడు మరింత 'పవర్' చూపేందుకు రెడీ అయ్యాడు. రీసెంట్ గా పవర్ ఆడియోతో పాటు విడుదల చేసిన ట్రైలర్ కూ ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ సినిమా థియేట్రికళ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర తన పవర్ చూపించడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాలో వినోదం కాస్త౦త ఎక్కువే వున్నట్లు అర్ధమవుతోంది. విక్రమార్కుడు సినిమాలోలాగే ఇందులో రవితేజ తన ట్రేడ్ మార్కు అల్లరి క్యారెక్టర్ తో పాటు పవర్‌ఫుల్‌గా కనిపించే రఫ్ అండ్ టఫ్ పోలీస్ క్యారెక్టర్ లో నటించాడు. ఈ ట్రైలర్ ని మీరు ఒకసారి చూడండి..!