English | Telugu

నాలుగు సంవత్సరాల్లో 750 ఇంజక్షన్స్.. నటుడి ధీనస్థితి

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi),దర్శకేంద్రుడు 'రాఘవేంద్రరావు'( k.Raghavendrarao)కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో 'ఘరానా మొగుడు' కూడా ఒకటి. ఈ మూవీలో వచ్చే మొదటి ఫైట్ లో 'వీరయ్య'గా చిరంజీవితో తలపడి మంచి గుర్తింపు పొందిన తమిళ నటుడు 'పొన్నాంబళం'(Ponnambalam). బాలకృష్ణ(Balakrishna),నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, (Pawan Kalyan)వెంకటేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో కూడా ఫైటర్ గా తన సత్తా చాటాడు.

పొన్నాంబళం గత కొంత కాలం నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్నీ తనే స్వయంగా అందరకి తెలియచేసాడు. రెండు మూత్ర పిండాలు చెడిపోయి, డయాలసిస్ అవసరం కావడంతో వెంటిలేటర్ పై ఉండి చికిత్స అందుకుంటున్నాడు. ఈ విషయంపై రీసెంట్ గా పొన్నాంబళం మాట్లాడుతు ప్రస్తుతం డయాలసిస్ నుంచి కోలుకుంటున్నాను. ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల్లో 750 ఇంజంక్షన్స్ ఇచ్చారు. రెండు రోజులుకి ఒకసారి రెండు ఇంజెక్షన్స్ చేసి నా ఒంటిలోని రక్తాన్ని తీసి డయాలసిస్ చేసేవారు. పూర్తిగా భోజనం చెయ్యలేను. ఉప్పు వాడలేను. పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు.ఎక్కువ మద్యం సేవించడం వల్లే డయాలసిస్ బారిన పడ్డాను. చాలా ఏళ్ళ క్రితమే మద్యం ఆపేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే చిరంజీవి, శరత్ కుమార్, ధనుష్, అర్జున్ వంటి వారు 'పొన్నాంబలం' కి ఆర్ధిక సాయం చేసారు 1988 లో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన 'పొన్నాంబళం' తమిళ, తెలుగు, కన్నడ, హిందీ,మలయాళం భాషల్లో కలిపి సుమారు వెయ్యికి పైగా చిత్రాల్లో ఫైటర్, విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఒంటిపై ఒక్క గాయం కూడా లేకుండా ప్రమాదకర యాక్షన్ సన్నివేశాలు చెయ్యడంలో పొన్నాంబళం స్పెషలిస్ట్.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.