English | Telugu

లావణ్య త్రిపాఠి కొణిదెల కొత్త చిత్రం.. ఒకటే నవ్వులు 

'అందాల రాక్షసి' తో సినీ రంగ ప్రవేశం చేసిన 'లావణ్య త్రిపాఠి కొణిదెల'(Lavanya Thripathi)ఆ తర్వాత అనతి కాలంలోనే తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తు, వంటి హిట్ చిత్రాలు లావణ్య ఖాతాలో ఉన్నాయి. వరుణ్ తేజ్(Varun Tej)తో వివాహం అయిన తర్వాత నటనకి దూరంగా ఉన్న లావణ్య ఇప్పుడు ‘సతీ లీలావతి’(Sathi Leelavathi)అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవ్ మోహన్(Dev MOhan)హీరోగా చేసాడు.

రీసెంట్ ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్‌ను గమనిస్తే లావణ్య, దేవ్ మోహన్ జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుంది. కానీ నెక్ట్స్ సీన్‌లోనే దేవ్ మోహన్‌ని లావణ్య కొట్టి కట్టేసుంటుంది. వారి మధ్య జరిగే గొడవకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను టీజర్‌లో మనం గమనించవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య జరిగే గొడవలో వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, జాఫర్, మొట్ట రాజేంద్రన్ ఎందకు ఇన్ వాల్వ్ అయ్యారు. అసలు గొడవేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.

గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య(Tatineni Satya)దర్శకత్వం వహిస్తున్నారు. ‌మాట‌లు: ఉద‌య్ పొట్టిపాడు, ఆర్ట్‌: కోసనం విఠల్, పి.ఆర్.ఓ : మోహ‌న్ తుమ్మ‌ల‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .