English | Telugu

పవన్ 25నిమిషాలకు15 కోట్లు..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా షూటింగ్ మొదలైతే చాలు రోజుకో వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్ లో హల్ చల్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న 'గోపాలా గోపాలా' చిత్రానికి సంబందించిన ఓ వార్త బయటకు వచ్చింది. 'గోపాలా గోపాలా' లో పవన్ పాత్ర కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ 25 నిమిషాల పాత్రకు గాను పవన్ కళ్యాణ్ ఏకంగా 15 కోట్లు పుచ్చుకున్నాడట. కేవలం 25 నిమిషాలకు వుండే పాత్రకు 15కోట్లా అని తెలుగు సినిమా నిర్మాతలంతా నోర్లు వెల్లబెడుతున్నారట. మరీ పవన్ కి ఈ పాత్ర కోసం అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటే అదంతా ఆయన మ్యాజిక్ తో వచ్చే ఓపెనింగ్స్ కోసమే కదా!

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.