English | Telugu

థియేటర్లలో పవన్ కళ్యాణ్ ప్రసంగం

పవన్ కళ్యాణ్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మార్చి14న పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే పవన్ పెట్టబోయే పార్టీ ఇదేనంటూ ఇప్పటివరకు చాలా పేర్లు వినిపించాయి. అయితే తాజాగా మరో పేరు వినిపిస్తుంది. పవన్ పెట్టబోయే పార్టీకి "జనసేన పార్టీ" అని నిర్ణయించినట్లు తెలిసింది. ఎలక్షన్ కమీషన్ కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. కాబట్టి పవన్ రాజకీయ ఎంట్రీ ఖాయమైనట్లేనని అర్థమవుతుంది. అయితే పవన్ ప్రసంగాన్ని సినిమా థియేటర్లలో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఆ థియేటర్ల వివరాలు మీకోసం ప్రత్యేకం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.