English | Telugu
బాలీవుడ్‌లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్
Updated : May 24, 2014
అలాగే ఒక ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నెంబర్ వన్ స్థానాన్ని కట్టబెట్టిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. స్థానం కన్నా అందరితో కలిసి ఉండగలగటం ఆనందంగా ఉందని తెలిపారు. చక్కటి కథ దొరికితే హిందీలోనూ నటిస్తానని మహేష్ చెప్పటంతో, బాలీవుడ్ దర్శకులకి ప్రిన్స్ ఇన్విటేషన్ ఇచ్చినట్లే అని భావించవచ్చు.
ఇక మహేష్ డేట్ల కోసం తెలుగు తో పాటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన మురుగుదాస్, మణిరత్నం లాంటి పెద్ద దర్శకులు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే విడుదల చేసే హీరోలవటంతో హిందీ సినిమాల్లో మహేష్ ను చూడటానికి అభిమానులు ఇంకా ఎంత కాలం వేయిట్ చేయవలసి వస్తుందో.