English | Telugu
పవన్ వెంకీల మల్టీస్టారర్ విడుదల తేది
Updated : Feb 25, 2014
హిందీలో ఘనవిజయం సాధించిన "ఓ మై గాడ్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మోడ్రన్ కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్, మధ్య తరగతి మనిషి పాత్రలో వెంకటేష్ నటించబోతున్నాడు. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ చిత్రానికి విడుదల తేదిని ప్రకటించేసింది చిత్ర యూనిట్. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లలో సురేష్ బాబు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.