English | Telugu

తగ్గని 'ఆర్ఆర్ఆర్' జోరు.. ఓ వైపు ఆస్కార్, మరోవైపు రీరిలీజ్!

'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై ఏడాది కావొస్తున్నా ఇప్పటికీ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ గెలిచినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే జపాన్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా ఇప్పటికే 1.2 బిలియన్ యెన్స్ కి పైగా కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్.. ఇప్పటికీ అక్కడ విజయవంతంగా రన్ అవుతోంది. ఇక మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనున్న తరుణంలో ఈ చిత్రం మరోసారి తెలుగునాట థియేటర్లలో సందడి చేయనుంది.

'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఇప్పటికే యూఎస్ లో మార్చి 3న రీరిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీకెండ్ లో కోటికి పైగా గ్రాస్ రాబట్టి(140K డాలర్స్) సత్తా చాటింది. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాని మార్చి 10న భారీగా మళ్ళీ విడుదల చేయనున్నారు. మరి రీరిలీజ్ లో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఆర్ఆర్ఆర్.. ఇటీవల 'కేజీఎఫ్-2'ని దాటేసి ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో సినిమాగా నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో 'దంగల్', 'బాహుబలి-2' ఉన్నాయి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.