English | Telugu

ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కి జై, తెలంగాణాలో ప్రభాస్ కి జై అంటున్న హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)రెబల్ స్టార్ ప్రభాస్(prabhas)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు.కొన్ని లక్షల మంది అభిమానులు ఆ ఇద్దరి సొంతం.పవన్ ప్రస్తుతం హరిహరవీరమల్లు(hari hara veeramallu)షూటింగ్ లో పాల్గొంటుండగా ప్రభాస్ తన అప్ కమింగ్ మూవీ ది రాజా సాబ్(raja saab)షూట్ లో పాల్గొంటున్నాడు.ఈ రెండు చిత్రాలపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ రెండు చిత్రాల్లోను ఇస్మార్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్(niddhi agerwal)హీరోయిన్ గా చేస్తుంది.కాకపోతే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రెండు సినిమా షూటింగ్స్‌ ఒకే రోజు జరుగుతుండగా, ఆ రెండింటిలోను తన పాత్రకు సంబంధించిన షూట్‌లో నిది పాల్గొంటోంది.అంటే ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ ని జరుపుకుంటున్నాయి.వీరమల్లు ఆంధ్రలో షూటింగ్ ని జరుపుకుంటుంటే, రాజాసాబ్ తెలంగాణాలో జరుపుకుంటుంది. దీంతో నిధి ఒకే రోజు ఆంధ్ర,తెలంగాణాకి జర్నీ చేస్తూ షూటింగ్ లో పాల్గొంటుంది.

ఈ విషయాన్నీ స్వయంగా తనే ట్విటర్ వేదికగా వెల్లడి చెయ్యడమే కాకుండా ఒకే రోజు ఇద్దరు అగ్ర హీరోలతో రెండు స్టేట్స్ లో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.ఈ రెండు సినిమాలు కూడా వీలైనంత త్వరగా షూటింగ్ ముగించుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న వీరమల్లు కి జ్యోతికృష్ణ(jyothi krishna)దర్శకుడు కాగా, రాజా సాబ్ కి మారుతి(maruthi)దర్శకుడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .