English | Telugu

పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమా థియేటర్లలో సందడి చేసి చాలా కాలమైంది. ఇప్పటికే పవన్‌ పూర్తి చేయాల్సిన మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొంతకాలం పవన్‌ ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత బిజీ అయిపోయారు. దీంతో ఆయన కమిట్‌ అయిన సినిమాలు ఆగిపోయాయి. మళ్ళీ పవన్‌ సెట్స్‌కి వస్తేనే తప్ప అవి పూర్తయ్యే అవకాశం లేదు. అయితే పవన్‌కళ్యాణ్‌ సినిమాలు ఎప్పుడు రిలీజ్‌ అవుతాయి అనే క్యూరియాసిటీతో అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే అభిమానుల కోరిక తీరబోతోంది. బ్యాలెన్స్‌ ఉన్న షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు పవన్‌. 

ఈ న్యూస్‌తో పవర్‌స్టార్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం ఫిలింసిటీలో షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్‌ భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఓజీ చిత్రానికి కూడా పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆ సినిమా కోసం కొన్ని డేట్స్‌ కేటాయించారు. దాని ప్రకారం షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నారు ఓజీ మేకర్స్‌. ఈ కొత్త షెడ్యూల్‌ కోసం ఫిలింసిటీలో సెట్స్‌ వేశారు. ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓజీ సెటనలో మరో రెండు రోజుల్లో ఎంట్రీ ఇస్తారు. వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. 

ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్‌శంకర్‌ కాంబినేషన్‌లో చేయబోయే ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కూడా సిద్ధంగా ఉంది. ఈ సినిమా గురించి ఎనౌన్స్‌ చేసి చాలా కాలమైంది. కానీ, హరి హర వీరమల్లు, ఓజీ గురించే అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఉస్తాద్‌ గురించి ఎవరూ ఆరా తీయడం లేదు. అసలు ఈ సినిమా ఉందా, లేదా అనే సందేహం కూడా అభిమానుల్లో ఉంది. ఇటీవల విడుదలై ఫ్లాప్‌గా నిలిచిన మిస్టర్‌ బచ్చన్‌ దానికి కారణం అని తెలుస్తోంది. ఆల్రెడీ పవన్‌ బయటికి వచ్చి షూటింగ్స్‌ కోసం డేట్స్‌ కేటాయిస్తున్నారు కాబట్టి ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాన్ని కూడా స్టార్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌, నిర్మాతల డెసిషన్‌ ఎలా ఉంటుందో చూడాలి.