English | Telugu

క‌మ‌ల్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన లేడీ సూప‌ర్‌స్టార్‌!

వారెవా. ఈ వార్త నిజ‌మేనా? అని అమితానందంలో మునిగి తేలుతున్నారు లేడీ సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్. న‌య‌న‌తార ఇప్ప‌టిదాకా ఎంతో మంది హీరోల‌తో క‌లిసి ప‌నిచేశారు. కానీ లోక‌నాయ‌కుడితో జోడీ క‌ట్ట‌లేదు. మేడ‌మ్ న‌య‌న్ త‌న పెర్ఫార్మెన్స్ విశ్వ‌రూపం చూపించాల్సిన టైమ్ వ‌చ్చింది అని హ్యాపీగా ఫీల‌వుతున్నారు. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హాస‌న్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌య‌న‌తార‌ని సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యం గురించి మ‌ణిర‌త్నం కాంపౌండ్‌గానీ, క‌మ‌ల్‌హాస‌న్ యూనిట్‌గానీ, న‌య‌న‌తార వ‌ర్గం గానీ ఇంకా అఫిషియ‌ల్ గా ఏం చెప్ప‌లేదు. అయినా కోడంబాక్కంలో గ్రాండ్‌గానే సంద‌డి చేస్తోంది ఈ వార్త‌. ప్ర‌స్తుతం షారుఖ్ స‌ర‌స‌న జ‌వాన్‌లో న‌టిస్తున్నారు న‌య‌న‌తార‌. ఈ సినిమాకు సంబంధించి చిన్న ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా న‌య‌న్ పోర్ష‌న్ అంతా పూర్త‌యింది. ప‌బ్లిసిటీ కార్య‌క్ర‌మాల‌కు ఎలాగూ దూరంగానే ఉంటారు కాబ‌ట్టి, అక్క‌డ కూడా కాల్షీట్లు వేస్ట్ కావు. ఈ మూవీ త‌ర్వాత రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఆ షూటింగ్ కూడా పూర్త‌య్యాక క‌మ‌ల్ సెట్స్ కి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నార‌ట న‌య‌న్‌.

విక్ర‌మ్ జోష్ మీదున్న క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌స్తుతం ఇండియ‌న్‌2 ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్త‌యిన వెంట‌నే మ‌ణిర‌త్నం స్క్రిప్ట్ కోసం ప్రిపేర్ కావాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. భారీ వ్య‌యంతో, బిగ్ స్కేల్‌లో తెర‌కెక్కిస్తున్నార‌ట ఈ సినిమాను. మ‌ణిర‌త్నం, క‌మ‌ల్‌హాస‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమా కోసం త‌మిళ తంబిలే కాదు, ఆల్ ఇండియా ఎదురుచూస్తోంది. ఆస్కార్‌లో అన్ని విభాగాల్లోనూ అవార్డులు కొట్టుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నార‌ట సినిమాను.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.