English | Telugu
సముద్రం అడుగున దాగి ఉన్న రత్నాన్ని బయటకి తీసిన నరేష్,పవిత్ర
Updated : Dec 2, 2023
సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ నటీమణి పవిత్రా లోకేష్ లు చట్టబద్ధంగా ఇంకా పెళ్లి చేసుకోకపోయినా ఇద్దరు కలిసే జీవిస్తున్నారు.ఇంకా గట్టిగా చెప్పాలంటే సహజీవనం చేస్తున్నారు. ఈ మధ్యనే అక్కడి గవర్నెమెంట్ పిలుపు మేరకు నరేష్ ఫిలిప్పీన్స్ వెళ్ళాడు. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ లో తనకి పవిత్రకి మధ్య జరిగిన విషయాల గురించి నరేష్ సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో పాటు ఒక వీడియోని కూడా పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో సంచలనం సృష్టిస్తుంది.
ఫిలిప్పీన్స్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి కార్యక్రమంలో నరేష్‌కు సర్ అనే బిరుదుని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నరేష్ ముందు అధికారికంగా సర్ అనే బిరుదు వచ్చి చేరింది.అంతే కాకుండా ఇక నుంచి నరేష్ ఏఎంబీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ సర్ నరేష్ గా మారాడు. ఈ కార్యక్రమంలో నరేష్ తో పాటు పవిత్రా లోకేష్ కూడా పాల్గొంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫిలిప్పీన్స్ లో ఉన్నహెలీకాప్టర్ ఐల్యాండ్‌లో ఎంజాయ్ చేసారు. అలాగే ఫిలిప్పీన్స్ సముద్రంలో దాగివున్న రత్నాన్ని కూడా కనుగొన్నారు. అక్కడనుంచి ఎల్ నిడో ఐల్యాండ్‌లో కూడా పర్యటించి లగూన్ బీచ్ లో కూడా ఎంజాయ్ చేసారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటిని తన అభిమానులకి తెలియచేయడమే కాకుండా ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోని నరేష్ తన ట్విట్టర్ లో అప్ లోడ్ చేసాడు.
మేమిద్దరం కలిసి చేసే ప్రయాణంలో మరిన్ని జ్ఞాపకాలను చేర్చుకున్నాం. ఈ జ్ఞాపకాలు నిజంగా వెలకట్టలేనివి అని కూడా నరేష్ తన పోస్టులో పేర్కొన్నాడు. నరేష్ ప్రస్తుతం తన లైఫ్‌లోని మధుర క్షణాలను గడుపుతున్నాడు.పైగా పవిత్రా లోకేష్ తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తన లైఫ్ చాలా బాగుందని నరేష్ చాలా బలంగా నమ్ముతున్నాడు.