English | Telugu

తగ్గేదేలే.. అల్లు అర్జున్ కి సవాల్ విసురుతున్న నాని!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప' మూవీ.. 2021 డిసెంబర్ 17న విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రభంజనంలోనూ 'శ్యామ్ సింగరాయ్'తో నేచురల్ స్టార్ నాని సత్తా చాటాడు. 'పుష్ప' విడుదలైన వారం రోజులకు డిసెంబర్ 24న థియేటర్లలో అడుగుపెట్టిన 'శ్యామ్ సింగరాయ్' మూవీ.. మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇప్పుడు నాని మరోసారి బన్నీతో తలపడనుండటం ఆసక్తికరంగా మారింది.

'పుష్ప-1' సంచలనం సృష్టించడంతో.. ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానున్న 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దెబ్బకి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని అందరూ అభిప్రాయపడుతున్నారు. పుష్ప-2 కి హిట్ టాక్ వస్తే.. కనీసం నాలుగు వారాలపాటు థియేటర్లలో ప్రభంజనం కనిపించే అవకాశముంది. అందుకే ఆ సమయంలో తమ చిత్రాలను విడుదల చేయడానికి పలువురు వెనకాడుతున్నారు. కానీ నాని మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. 'పుష్ప-2' విడుదలైన రెండు వారాలకే ఆగస్టు 29న 'సరిపోదా శనివారం'తో థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాడు.

'అంటే సుంద‌రానికీ' తర్వాత నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'సరిపోదా శనివారం'. ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' వాయిదా పడితే.. ఆ తేదీకి రావాలని 'సరిపోదా శనివారం' మూవీ టీం చూస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే 'పుష్ప-2' టీం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15నే వస్తామని చెబుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 29న తమ సినిమాని విడుదల చేయనున్నట్లు 'సరిపోదా శనివారం' మేకర్స్ తాజాగా ప్రకటించారు. అంటే 'పుష్ప-2' రిలీజ్ అయిన రెండు వారాలకే, 'సరిపోదా శనివారం' రిలీజ్ కానుంది. మరి నాని మరోసారి 'శ్యామ్ సింగరాయ్' మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.