English | Telugu

అండగా నిలిచిన ముగ్గురు అన్నయ్యలు.. థాంక్స్‌ చెప్పిన త్రిష!

25 సంవత్సరాల క్రితం నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా నిలబడిరది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 70 సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ప్రేక్షకులు ఆమెను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయంటే ఆమె ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దిగ్విజయంగా 25 సంవత్సరాల కెరీర్‌ను పూర్తి చేసుకున్న త్రిషను ఇటీవల పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆమె ప్రమేయం లేకుండానే వివాదాల ద్వారా వార్తల్లోకి ఎక్కుతోంది.

ఆమధ్య ‘లియో’ చిత్రంలో విలన్‌గా నటించిన మన్సూర్‌ అలీఖాన్‌.. త్రిషపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఎంతోమంది సెలబ్రిటీస్‌ ఆమెకు మద్దతుగా నిలిచారు. చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకునేందుకు త్రిష సిద్ధపడడంతో అతను క్షమాపణలు చెప్పాడు. అలా ఆ వివాదానికి తెరపడిరది. తాజాగా అన్నా డిఎంకె నాయకుడు ఎ.వి.రాజు చేసిన వ్యాఖ్యలతో మరోసారి త్రిష వార్తల్లోకి వచ్చింది. ఓ ప్రముఖ రాజకీయ నేత ఆమెకు రూ.25 లక్షలు చెల్లించి రిసార్ట్‌కి తీసుకెళ్లాడంటూ అతను వ్యాఖానించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎ.వి.రాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచిన త్రిష అతనికి నోటీసులు పంపింది. ఈ వ్యవహారంలో హీరో విశాల్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్‌, సముద్రఖని, నాజర్‌ ఆమెపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిరచారు. ఈ విషయంలో తనకు మద్దతు ఇచ్చిన ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ సోషల్‌ మీడియా వేదికగా త్రిష స్పందించింది. అయితే ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, ఎలా ముగుస్తుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్‌ చెయ్యక తప్పదు.

ఇక త్రిష చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అజిత్‌ సరసన ‘విడాముయర్చి’ చిత్రంలో నటిస్తోంది. అలాగే మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది. అందులో మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న ‘రామ్‌’ కూడా ఉంది. ఇక కమల్‌హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘థగ్స్‌ లైఫ్‌’ చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది త్రిష. మెగాస్టార్‌ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘విశ్వంభర’లో కూడా నటిస్తోంది. ఇవికాక వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో కూడా త్రిషను హీరోయిన్‌గా బుక్‌ చేశారని తెలుస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.